calender_icon.png 1 November, 2024 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టులకు సొంత భవనాలు లేవు.. అద్దె భవనాల్లో కోర్టులు

02-08-2024 11:39:28 AM

హైదరాబాద్‌: అద్దె భవనాల్లో కోర్టులు నిర్వహించడం బాధాకరమని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సివిల్ కోర్టు సవరణ బిల్లును సమర్థిస్తూ కొన్ని సూచనలు చేస్తున్నానని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో కోర్టులకు సొంత భవనాలు, నియోజకవర్గాల్లో జూనియర్ సివిల్ కోర్టులు లేవని సూచించారు. కేసులు సత్వర పరిష్కారం కావాలంటే జూనియర్ సివిల్ కోర్టులు పెంచాలని వెల్లడించారు. కోర్టుల అంశంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దాలని ఏలేటి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.