calender_icon.png 23 February, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సున్నితమైన కథాంశంతో కోర్ట్

23-02-2025 12:39:37 AM

నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన మూవీ ‘కోర్ట్’. -‘స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సంద ర్భంగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా మేక ర్స్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాని మాట్లాడుతూ.. “వీళ్ళందరితో ‘కోర్టు’ సినిమాని తీసి నేరం చేసింది నేనే. కావాలంటే అరెస్ట్ చేసుకోండి.(నవ్వుతూ) కానీ మార్చి 14 సినిమాని బ్లాక్ బస్టర్ చేయండి. ఈ కథ చాలా సెన్సిటివ్ మేటర్. సినిమా పూర్తయినప్పటికీ నిలబడి క్లాప్స్ కొడతారు” అన్నారు. నిర్మాత దీప్తి గంటా మాట్లాడు తూ.. “నాని, ప్రశాంతి ప్రొడక్షన్ హౌస్ లో రెగ్యులర్ ప్రొడ్యూసర్ రూల్ బుక్ వుండదు.

కథ నచ్చితే ఎంత అయి నా పెడతారు. జగదీశ్ అద్భుత మైన స్క్రిప్ట్ రాశా రు. అంతే అద్భుతంగా సినిమాని తీశాడు” అని పేర్కొన్నారు. ప్రియదర్శి మాట్లాడు తూ.. “తెలుగు సినిమా గారాల చిన్నకొడుకు నాని అన్న.

ఒక్క సిట్టింగ్‌లో కథని ఓకే చేశారు” అన్నారు. డైరెక్టర్ రామ్ జగదీష్  మాట్లాడుతూ.. “ఒక్క డౌట్ లేకుండా స్క్రిప్ట్‌ని నమ్మి నాని సినిమా చేశారు. గంటసేపు దర్శి క్యారెక్టర్ సినిమాలో ఉండదని తెలిసినా ఆయన ఒప్పుకున్నారంటే దర్శి ఎలాంటి నటుడు అర్థం చేసుకోవచ్చు” అన్నారు.