13-03-2025 01:03:46 AM
నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ ‘కోర్ట్:- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చి త్రం మార్చి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రా మ్ జగదీష్ సినిమా విశేషాలు విలేకరుల సమావేశంలో పంచుకున్నారు. “ఈ కథ ఫోక్సో యాక్ట్ నేప థ్యంలో ఉంటుంది.
నిజ జీవితంలో ఇలాంటి ఒక కేసుని నేను పరిశీలించాను. ఇలాం టి కేసులు ఇంకా చాలా ఉన్నాయని తెలిసింది. ఆ కేసులు అన్నిటి మీద కూడా రీసెర్చ్ చేశాను. అలా చాలా కేసులు రిఫర్ చేశాం. అయితే ఏ కేసు గురించి తెలుసుకున్నాక ఈ కథ పుట్టిందనేది ఇప్పుడు చెప్పను.
నాని గారు కథ మొత్తం విని ‘వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా’ అన్నారు. ఫోక్సో చాలా ముఖ్యమైన యాక్ట్. నిజానికి ఆ చట్టం గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. అది ఈ సినిమాలో చూస్తారు. శివాజీ గారు మంగపతి క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ప్రతి ఫ్యామిలీలో అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది.