25-04-2025 12:12:38 AM
భోలక్‌పూర్‌లో పోలీసుల భారీ బందోబస్తు
ముషీరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): భోలక్‌పూర్ డివిజన్ అంజయ్య నగర్ సాయిబాబా దేవాలయం వీధిలో జనావాసాల మధ్య కొనసాగుతున్న ప్లాస్టీక్ స్క్రాప్ దుకాణాలను కోర్టు ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు గురువారం జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మన్సిపల్ కమిషనర్ రామానుజరెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ దేవేందర్ తదితరులు కోర్టు ఆదేశాలు ఉండడంతో సాయిబాబా దేవాలయం వీధిలో కొనసాగుతున్న షాపులను పోలీస్ బందోబస్తు మధ్య మూసివేశారు. జనావాసాల మధ్య ఉన్న ప్లాస్టిక్ షాపుల వల్ల గతంలో పలు మార్లు అగ్ని ప్రమాదాలు జరగడంతో స్థానికులు కోర్టుకు వెళ్లి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేసు వేశారు.
కోర్టు తీవ్రంగా హెచ్చరించడంతో అధికారులు ఉన్నఫలంగా భోలక్పూర్ వచ్చి షాపులను మూసివేశారు. ఈ సందర్భంగా సంబంధిత షాపు యజమానులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు కోర్టు ఆదేశాలు ఉండడం వల్ల తాము షాపులను మూసివేశామని అధికారులు వారికి సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా ముషీరాబాద్ సీఐ రాంబాబు, ఎస్త్స్ర ప్రసాద్ రెడ్డి తదితరులు భారీ పోలీస్ బందోబస్తు షాపులను సీజ్ చేసిన ప్రాంతంలో ఏర్పాటు చేశారు. తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని పేర్కొంటూ వ్యాపారులు సైతం కోర్టుకు వెళ్లారని ఇరువర్గాలు వాదనలు కోర్టులో తేలనున్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ సూపర్వైజర్ గోవర్ధన్, ఎస్‌ఎఫ్‌ఎలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదాలే కారణం
సాయిబాబా దేవాలయం వీధిలో జనావాసాల మధ్య ప్లాస్టిక్ స్క్రాబ్ షాపులు, గో దాములు ఉండడం వల్ల ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో స్థాని క ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.