10-03-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 9 (విజయ క్రాంతి): కేటీపీఎస్ బూడిద తరలింపులో ప్రభావిత ప్రాంత యువకులకు ఉపాధి కల్పిస్తూ, పిటీషనర్లకు సైతం అవకాశం ఇవ్వాలని గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు తుంగలో తొక్కి, ప్రభావిత ప్రాంత ప్రజల నోట్లో బూడిద కొట్టిన వైనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని కేటీపీఎస్ కర్మాగారంలో చోటుచేసుకుంది. రాజకీయ అండగదండ కలిగిన ఆ త్రిమూర్తులు దర్జాగా యాష్ మాఫియా జోరుగా సాగిస్తున్నారు. వారికి అధికార పార్టీ మంత్రి, ఓ ప్రజా ప్రతినిధి, అనుచరుల అండదండ దండిగా ఉండటం ప్రభావిత ప్రాంత ప్రజలకు తీరని అన్యా యం చోటుచేసుకుంది. నిబంధనలకు విరు ద్ధంగా దొడ్డిదారిన ఆర్డర్ పొంది రోజుకు రూ 10 నుంచి 12 లక్షల విలువ గల బూడిదను తరలిస్తూ దండుకుంటున్నారనే ఆరోపణలు వెలబడుతున్నాయి. దీంతో ప్రభావిత ప్రాం తంలో అర్హులైన గిరిజనులు, తల సేమియా, సికిల్ సెస్ వ్యాధిగ్రస్తులు సైతం ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన దీన పరిస్థితి నెలకొంది.
ప్రభావిత ప్రాంత యువకులు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చిన అధికారులు అమలు చేయడం లేదంటే రాజకీయ ఒత్తిడి ఏ మేరకు ఉందో ఇట్టే చెప్పవచ్చు. వివరాల్లోకి వెళితే 2022- సంవత్సర ములో 55 మంది జనరల్ కేటగిరీలో బూడి దను తరలించేందుకు 14 మందితో కమిటీని వేసుకొని, మిగిలిన 41 మందిని సభ్యులుగా చేర్చుకొని బూడిద తరలించేందుకు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో త్రిమూర్తుల పేరు తో పిటీషన్ దాఖలు చేయడం ప్రభావిత ప్రాంత యువకులు చేసిన పాపమైంది. పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు wp 11261/2023లో ప్రభావిత ప్రాంత యువ కులకు ఉపాధి కల్పిస్తూ, వారితో పాటు ప్రొటీషనర్లకు సైతం అవకాశం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆర్డరు ఒక విధంగా ఉంటే త్రిమూర్తులు ఆర్డర్ను వక్రీకరించి కాంట్రాక్టు తమకే వచ్చిందంటూ, మిగిలిన సభ్యులందరినీ పక్కకు నెట్టి రాజకీయ నాయకుల ప్రమేయంతో ప్రభావిత ప్రాంత యువకులకు తీరని అన్యాయం చేశారు.
కేటీపీఎస్ అధికారులు సైతం నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ కార్డు ఆధారంగా త్రిమూర్తులకు బూడిదను తరలించేందుకు వర్కు ఆర్డర్ జారీ చేశారని తెలుస్తోంది. మరోవైపు కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ ప్రభావిత ప్రాంత యువకుల నుంచి బూడిద తరలింపుకు దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 79 మంది గిరిజన యువకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 39 మంది అర్హులుగా గుర్తించి వారికి బూడిదన తరలించేందుకు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వీరంతా నిబంధనల ప్రకారం కేటిపిఎస్‌కు చెల్లించాల్సిన ధరావత్ సొమ్మును ఈ ఏడాది జనవరిలో డిడి రూపంలో చెల్లించారు.
ఇక బూడిదను తరలించేందుకు సర్వం సిద్ధం చేసుకుని లారీల్లో బూడిదను నింపే క్రమంలో అధికారులు అర్ధాంతరంగా బూడిదను తరలించ వద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. జరిగిన అన్యా యాన్ని గుర్తించిన గిరిజన యువకులు తిరిగి కోర్టును ఆశ్రయించి త్రిమూర్తులపై స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ ఆర్డర్ ను అధికారులు అమలు చేయడంలో విఫలమయ్యారు. అధికారులపై రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా కేటీపీఎస్ ఎస్ ఇ స్థాయి అధికారి వారం రోజులపాటు సెలవు పై వెళ్లి, త్రిమూర్తులు కోర్టును ఆశ్రయించి, గిరిజన యువకులకు వ్యతిరేకంగా స్టే ఆర్డర్ తెచ్చేందుకు పరోక్షంగా సహకరించారని ఆరోపణలు వెలబడుతు న్నాయి.
త్రిమూర్తులపై అనర్హులను తెచ్చిన ఆర్డర్ను అమలు చేయని అధికారులు, వారు గిరిజనులపై తెచ్చిన స్టే ఆర్డర్ ను అమలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కోర్ట్ ఆర్డర్ ను అతిక్రమించిన అధికారులపై సైతం గిరిజన యువకులు కోర్టును ఆశ్రయించారు. ఇంత జరుగుతు న్నా బూడిద తరలింపు మాత్రం ఆగకపో వడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ బూడిద తరలింపులో జరుగుతున్న అన్యా యంపై క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభావిత ప్రాంత గిరిజన యువకులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.