calender_icon.png 23 December, 2024 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్‌గాంధీకి కోర్టు నోటీసులు

23-12-2024 02:20:38 AM

* కులగణనపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు

* జనవరి 7న హాజరు కావాలని బరేలీ కోర్టు ఆదేశాలు

లక్నో, డిసెంబర్ 22: కులగణనపై లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో జనవరి 7 కోర్టుకు హాజరుకావాలని ఎంపీ రాహుల్ గాంధీకి బరేలీ జిల్లా కోర్టు నోటీసు లు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పంకజ్ పాఠక్ అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాహుల్ వ్యాఖ్యలు దేశంలో విభజన, అశాంతిని ప్రేరేపించే అవకాశం ఉందని, న్యాయప రమైన జోక్యం అవసరమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ముందుగా స్పెషల్  ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణకు తిరస్కరించింది. దీంతో తాజాగా అతడు జిల్లా కోర్టును ఆశ్రయించా డు. విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది.

హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో..

హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ కులగణనపై మాట్లాడారు. బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో ఆర్థిక, సంస్థాగత సర్వే చేపడతామని పేర్కొన్నారు.‘ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), మైనా ర్టీ వర్గాలకు చెందిన వారు ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు మొదట దేశవ్యాప్త కులగణన నిర్వహిస్తాం. ఆ తర్వాత ఆర్థిక, సంస్థాగత సర్వే చేపడతాం’ అని చెప్పా రు. ఈ వ్యాఖ్యలపై పిటిషనర్ కోర్టుకు వెళ్లినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్ల డించాయి.

రెస్టారెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు

పార్లమెంట్ సమావేశాలు ముగియడంతో సోనియాగాంధీ కుటుంబం కొద్దికాలం విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిసిం ది. ఈక్రమంలో తమ అధికారిక కార్యక్రమాలను పక్కనపెట్టి కుటుంబం కోసం సమయం కేటాయించారు. ప్రియాంక గాంధీ వాద్రా దంపతులతో పాటు వారి కూతురు మిరాయతో కలిసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలోని క్వాలిటీ రెస్టారెంట్‌కు వెళ్లారు. అందరూ కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా “మీరు ఇక్కడకు వస్తే చోలే భటూరే ట్రై  చేయండి” అంటూ భోజన ప్రియులకు రాహుల్ సూచించారు. రెస్టారెంట్‌లో గడిపిన ఫొటోలను సోషల్ మీడియా లో రాహుల్ షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.