calender_icon.png 19 January, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాలూ, తేజస్వీకి కోర్టు నోటీసులు

19-09-2024 03:27:15 AM

పాట్నా, సెప్టెంబర్ 18: మనీ లాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, అతడి కుమారుడు తేజస్వియాదవ్‌కు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీచేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ‘భూమికి ఉద్యోగం’ కుంభకోణంలో లాలూకు సమన్లు ఇచ్చింది. ఏకే ఇన్ఫోసిస్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రతాప్‌యాదవ్‌తో పాటు మరికొందరికి సైతం కోర్టు సమన్లు పంపింది. అక్టోబర్ 7లోపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 2004 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ ఉద్యోగ నియమకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఇదే వ్యవహారంపై నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ సైతం కేసు నమోదు చేసింది. గతేడాది మార్చిలో ఢిల్లీ, బీహార్, ముంబై తదితర 25 చోట్ల సోదాలు చేపట్టారు. అనంతరం లాలూ కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు, రెండు సంస్థల పేర్లతో ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.