calender_icon.png 9 March, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్ట్.. అంచనాలకు తగ్గదు

09-03-2025 12:56:01 AM

స్టార్ హీరో నానికు చెందిన వాల్ పోస్టర్ సినిమా సంస్థ సమర్పణలో రూపొందుతు న్న సినిమా ‘కోర్ట్’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ జగదీశ్ దర్శకుడు కాగా ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. సినిమా మార్చి 14న విడుదల కానున్న సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. టాలీవుడ్ డైరెక్టర్లు నాగ్‌అశ్విన్, ప్రశాంత్‌వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, ఇంద్రగంటి మోహనకృష్ణ, దేవ కట్టా అతిథులుగా పాల్గొన్నారు. హీరో నాని మాట్లాడుతూ.. ‘నా కెరియర్‌లో ఎప్పుడూ సినిమా చూడాలని బతిమాలలేదు..

ఈ సినిమా కు అడుగుతున్నా. మాకేదో సక్సెస్ రావాలని కాదు. ఈ సినిమా చూసిన తర్వాత నేను చెప్పిన అంచనాలు మ్యాచ్ కాలేదనిపిస్తే, ఇంకో రెండు నెలల్లో రిలీజ్ అవుతున్న నా ‘హిట్3’ని ఎవ రూ చూడొద్దు” అన్నారు. ‘ఇది ఒక సూపర్ హీరో లాంటి కథ’ అని నటుడు ప్రియదర్శి అన్నారు. నటుడు హర్ష రోషన్, నటి శ్రీదేవి డైరెక్టర్ రామ్ జగదీశ్, నిర్మాత దీప్తి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్, లిరిక్ రైటర్ పూర్ణాచారి, మూవీ యూనిట్ పాల్గొన్నారు.