పాక్ గూఢచారి సంస్థ మాజీ అధిపతి హమీద్ అరెస్టు
ఇస్లామా బాద్, ఆగస్టు 12: పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ మాజీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను అరెస్టు చేసినట్టు ఆ దేశ సైన్యం సోమవారం ప్రకటించింది. ఆయనపై కోర్టుమార్షల్ నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. ఓ భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతోపాటు పదవీ విరమణ చేసి న తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకొన్నట్టు ప్రకటించిం ది. టాప్ సిటీ అనే ప్రైవేట్ హౌసింగ్ మేనేజ్‌మెంట్ పథకానికి సంబంధించిన కేసులో ఆయన జోక్యం చేసుకొ న్నారనే ఆరోపణలు వచ్చాయి.
ఆ స్కీం ను ప్రారంభించిన సంస్థ కార్యాలయాల్లో 2017 మేలో హమీద్ తన బలగంతో అక్రమంగా సోదాలు నిర్వహించారు. కంపెనీకి చెందిన బంగా రం, వజ్రాలు తీసుకెళ్లారని ఆ సంస్థ యజమానులు కోర్టులో కేసు వేశారు. హమీద్‌పై తీవ్రమైన ఆరోపణలు రావటంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో సైన్యం దర్యాప్తు ప్రారంభించింది. ఫైజ్ హమీ ద్ 2022లో సైన్యాధ్య పదవి రేసులో ఉన్నారు. అయితే అనూహ్యంగా ఆయ న రిటైర్‌మెంట్‌కు నాలుగు నెలల ముందుగానే రాజీనామా చేశారు.