హైకోర్టు రిజిస్ట్రార్ హెచ్చరిక
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): హైకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారాలను రికార్డింగ్ చేయరాదని హైకో ర్టు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. లైవ్ రికార్డింగ్ చేసి వాటిని మీడియాలో ప్రసారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కోర్టు ప్రొసీడింగ్స్‌ను టీవీలు, సోషల్ మీడియాలో ప్రసారం చేయడం చట్ట వ్యతిరేకమని, ఇలా చేసిన వాళ్లపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ప్రసారాలు ఆన్‌లైన్‌లో ఉంటే తొలగించాలని హైకోర్టు రిజిస్ట్రార్(ఐటీ విభాగం) శుక్రవారం స్పష్టం చేశారు.