calender_icon.png 3 October, 2024 | 11:48 AM

మంథనిలో కోర్టు తీర్పు బేఖాతర్

03-10-2024 12:44:18 AM

  1. కూల్చిన ఇండ్లకు మరమ్మతులు
  2. పట్టించుకోని మున్సిపల్ పాలకవర్గం

మంథని, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మంథనిలో కోర్టు తీర్పును లెక్క చేయకుండా కూల్చిన ఇండ్లకు మరమ్మతులు చేస్తు న్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గతం లో మంథని పట్టణంలో మున్సిపల్ అనుముతులు లేకుండా నిర్మించిన ఇండ్లను కో ర్టు తీర్పు మేరకు ఆరు నెలల క్రితం మున్సిపల్ కమిషన్‌ర్, పోలీసులతో కలిసి పాక్షిక ంగా కూల్చివేశారు.

కంగుతిన్న ఇండ్ల యజమానులు మరో అవకాశం ఇవ్వాలని కోర్టు కు పోయి తాత్కాలిక స్టే తెచ్చుకున్నారు. అప్పటి నుంచి గమ్ముగా ఉన్న ఇళ్ల యజమానులు గత వారం రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ బదిలీపై వెళ్లడంతో అక్రమ ంగా నిర్మించిన ఇండ్లకు మరమ్మతులు చేపట్టడం మొదలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

మం థని కూరగాయల మార్కెట్ వద్ద ప్రధాన రహదారి పక్కనే రోడ్డును ఆక్రమించిన నిర్మి ంచిన ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలు కంగుతిన్నారు. పేదవానికి ఒక న్యాయం, ఉన్నవాళ్లకు మరో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇంటి మరమ్మతులు మున్సిపల్ అధికారులకు కనిపిండంలేదా అని చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై మున్సిపల్ నూతన కమిషనర్‌ను వివరణ కోరగా.. అక్రమ ఇండ్లపై తనకు సమాచారం లేదని, విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.