calender_icon.png 10 April, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు భవనానికి మరమ్మతులు ప్రారంభం

25-03-2025 01:25:37 AM

పటాన్ చెరు, మార్చి 24 :జిన్నారానికి మంజూరైన జూనియర్ సివిల్ జడ్జి, జ్యూడిషయల్ ఫస్ట్ క్లాస్  మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు ఎంపిక చేసిన  భవనానికి అవసరమైన  మరమత్తు పనులను సోమవారం ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ విష్ణువర్దన్ రెడ్డి, నర్సాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డీ శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్లు న్యాయవాదులతో కలిసి ఐకేపీ భవనానికి మరమత్తు పనులను  ప్రారంభించారు.

అనంతరం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్గన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన తరువాత హైకోర్టు న్యాయవాది ప్రతాప్ రెడ్డి సహకారంతో  జిన్నారం మండలంలో  కోర్టు ఏర్పాటు ప్రయత్నాలు చేపట్టినట్లు చెప్పారు. జిన్నారం మండలంలో కోర్టు ఏర్పాటుకు రెవెన్యూ కార్యాలయం వెనుక ఉన్న ఐకేపీ భవనం అనుకూలంగా ఉండడంతో జిల్లా న్యాయ మూర్తులు దీనిని ఎంపిక చేశారని చెప్పారు.

నూతన కోర్టు భవనం నిర్మాణం జరిగే వరకు తాత్కాలికంగా ఇక్కడే కోర్టు నిర్వహణ ఉంటుందన్నారు. అనంతరం నర్సాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మూడు మండలాలైన జిన్నారం, గుమ్మడిదల, హత్నూరలోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలకు ఈ కోర్టు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిన్నారంలో నూతన కోర్టు భవనం నిర్మాణానికి ప్రపోజల్స్ కూడా వెళ్లినట్లు చెప్పారు.

జిన్నారానికి కోర్టు భవనం మంజూరు కావడం శుభసూచకమని మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జీ శ్రీనివాస్, ప్రకాశ్, ఏ శ్రీనివాస్, సత్యనారాయణ, బాలకిషన్, సుధాకర్, రాజు, మధుశ్రీ, నాగరాజు, సాయి, రమాకాంత్, వెంకట్రామ్ రెడ్డి, నాయకులు ప్రతాప్ రెడ్డి, రాజిరెడ్డి, కోటేశ్ గౌడ్, నరేశ్, నరేందర్, పల్నాటి భాస్కర్, వెంకటేశ్ గౌడ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.