- 4 కోర్సులకు సంబంధించి 3 స్కూళ్లు షురూ
- అక్టోబర్ 29 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ప్రారంభమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో మొదటి విడతలో భాగంగా దసరా నుంచి కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలంగాణ పరిశ్రమల, వాణిజ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రాథమికంగా 4 కోర్సులు అందుబాటులో ఉంటాయని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటికి సంబంధించి మూడు స్కూళ్లను ప్రారంభించినట్లు పేర్కొంది. వాటిలో స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ ఈ స్కూల్ ఆఫ్ హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ ఉన్నాయని వెల్లడించింది.
లాజిస్టిక్స్ అండ్ ఈకామర్స్ విభాగంలో వేస్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్‌సైనర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్ కోర్సులో ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్ కోర్సు, ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ విభాగంలో ఫార్మా అసోసియేట్ ప్రొగ్రాం కోర్సు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
అర్హులైన అభ్యర్థులు యంగ్ ఇండియా స్కిల్స్ యూని వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https:/ /yisu.in ద్వారా అక్టోబర్ 29 దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నవంబర్ 4 నుంచి కోర్సులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ క్యాంపస్‌ల్లో తాత్కాలికంగా తరగతులను నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది.