calender_icon.png 21 December, 2024 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధైర్యమే కవచం.. ఆశే ఆయుధం

16-10-2024 12:01:39 AM

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సాయి దుర్గా తేజ్ మం చి విజయాలు తన ఖాతాలో వేసుకుంటున్నారు. ‘విరూపాక్ష’, ‘బ్రో’ చిత్రాల విజయం తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఎస్‌డీటీ18 చేస్తున్నారు. సాయి దుర్గా తేజ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకుడిగా పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్ మెంట్  బ్యానర్‌పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘ధైర్యాన్నే కవచంగా, ఆశను ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరి కోసం నిలబడతాడు. ఇది ఆరంభం మాత్రమే’ అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను విడుదల చేసి సాయి దుర్గా తేజ్‌కు చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది.

‘ఈవిల్ ఫోర్స్ కారణంగా చాలా కాలంగా కష్టాలు ఎదురుకుంటున్న ఓ నేల, తన రక్షకుని రాక కోసం ఎదురు చూస్తుంటుంది, చివరికి వారి నిరీక్షణ ఫలిస్తుంది’ ఈ కథాంశం ఆధారంగా సిని మా రూపొందనుంది. హీరోని బీస్ట్ మోడ్‌లో ప్రెజెంట్ చేశారు. సాయి దుర్గా తేజ్ మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.