calender_icon.png 19 January, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య?

19-01-2025 12:31:24 AM

* చెరువులో దూకిన భార్యభర్తలు 

ఖమ్మం, జనవరి 18 (విజయక్రాంతి): చెరువులో దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో చోటు చేసుకుంది. బుగ్గపాడు గ్రామానికి చెందిన పంతంగి కృష్ణారావు, సీత దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా ముగ్గురికీ పెళ్లిల్లు చేశారు. కృష్ణారావు ఆటో నడుపుతుండగా, సీత కూలి పనులు చేస్తున్నది.

శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో స్థానిక రావి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు చెరువు వద్దకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు మృతదేహాలను చెరువు నుంచి బయటకు తీయించి, పోస్టుమార్టం కోసం తరలించారు.

దంపతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటపడే మార్గం లేకనే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. సత్తుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.