25 May, 2026 | 1:46 AM

దావాగ్నికి దంపతులు బలి

25-05-2026 12:04 AM
  1. మంటల్లో చిక్కుకొని భర్త, ఊపిరాడక భార్య దుర్మరణం 
  2. భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో ఘటన

జయశంకర్ భూపాలపల్లి, (మహబూబాబాద్), మే 24 (విజయక్రాంతి): పంట అవశేషాలను కాల్చేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని భర్త మరణించగా, అదే సమయంలో విపరీతమైన పొగ కారణంగా ఊపి రాడక అపస్మారక స్థితికి చేరుకున్న భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఒకే రోజు భార్యాభర్తలు దావాగ్నికి బలై దుర్మరణం పాలైన ఘటన జయశంకర్ జిల్లా భూపాలపల్లి రేగొండ మండలం రేపాకపల్లిలో శనివారం జరిగింది. గ్రామానికి చెం దిన సాగర్ల చంద్రమౌళి (62) అనే రైతు తన భార్య భాగ్యమ్మ (58), కుమారుడు భాస్కర్ తో కలిసి శనివారం పొలం వద్దకు వెళ్లి పొ లంలో మిగిలిన పంట అవశేషాలకు నిప్పంటించారు. 

ఈ క్రమంలో మంటలు వ్యాప్తించి పక్క పొలానికి అంటుకున్నాయి. దీనితో ఆ మంటలను కుమారుడు భాస్కర్ తో కలిసి భార్యాభర్తలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చంద్రమౌళికి మంటలు అంటుకుని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. 

ఎండ తీవ్రతకు, మంటల వేడికి భాగ్యమ్మ కూడా తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం హనుమకొండకు తర లించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.