calender_icon.png 19 April, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కపుల్‌ ఫ్రెండ్లీకి గుమ్మడికాయ కొట్టేశారు

18-03-2025 12:00:00 AM

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది.‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా టైటిల్ కొత్తగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా వీడియో గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఈ సినిమా ఆడియెన్స్‌కు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇవ్వనుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.