16-03-2025 07:49:20 PM
సారవకోట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కురిడింగి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు కుటుంబంతో వెళుతున్న ఓ కారు.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పాతపట్నానికి చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్ (56), భార్య వాణి(45) అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమారుడితో పాటు ప్రయాణించినా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. బాధితులు శ్రీకాకుళంలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.