13-12-2024 12:20:02 AM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూర్ తండాకు చెందిన దంపతులు ఇద్దరు గురువారం రొడ్డు ప్రమాదంలో మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మల్లూర్ తండాకు చెందిన విస్లావత్ సంగ్యా నాయక్(50), ఆయన భార్య సంగీబాయి(45)తో కలిసి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కల్వేర్ మండలం వద్ద కారు ఢీకొనడంతో దంపతులు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఘటన స్థలానికి కల్వేర్ మండల పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.