12-10-2024 01:55:23 AM
వనపర్తి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): సీతాఫలాల కోసం వెళ్లిన దంపతులు ప్రమాదవశాత్తు విద్యు త్ షాక్‌తో మృతి చెందిన ఘటన శుక్రవారం వనపర్తి జిల్లా కొత్త బం డరావిపాకుల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దు సు బక్కయ్య (50), నాగమ్మ (46) దంపతులు. తమ గ్రామానికి సమీపంలో ఉన్న నాగర్‌కర్నూల్ జిల్లా గుడిపల్లి గట్టుకు శుక్రవారం సీతాఫలాల కోసం వెళ్లారు. అక్కడ విద్యుత్ వైర్లను గమనించకుండా సీతాఫలాలు తెంపుతుండగా వైర్లకు తగిలి షాక్‌తో మృతిచెందారు. మృతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.