సిరిసిల్ల వెంకంపేటలో విషాదం
సిరిసిల్ల, నవంబర్ 9 (విజయక్రాంతి): చేతిలో పనులు లేక, చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మనస్థాపానికి గురైన దంప తులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలో జరిగింది. పట్టణంలోని వెం కంపేట 37 వార్డు మైసమ్మ కాలనీ నేత కుటుంబానికి చెందిన బైరి అమర్ (46), స్రవంతి(41) దంపతులు. వారికి కూతుళ్లు లహరి, సిరిమల్లి, కుమారుడు దీక్షిత్ ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా చేతినిండా పని లేకపోవడం, అప్పులు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువవడంతో మనస్థాపానికి గురైన దంపతులు శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.