calender_icon.png 11 March, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య

11-03-2025 01:19:46 AM

హైదరాబాద్, మార్చి ౧౦ (విజయక్రాం తి): హైదరాబాద్‌లోని హబ్సిగూడలో సోమవారం రాత్రి విషాదం నెలకొంది. ఇద్దరు పి ల్లలను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకు న్నారు. హబ్సిగూడ రోడ్ నెంబర్ 8 లో చంద్రశేఖర్‌రెడ్డి(40) భార్య కవితరెడ్డి(35), కూ తురు శ్రీతరెడ్డి(13), కుమారుడు బిశ్వంత్ రెడ్డి (10)తో కలిసి నివాసముంటున్నాడు. చంద్రశేఖర్‌రెడ్డి ఓ కాలేజీలో లెక్చరర్‌గా పని చేసేవాడు.

ఆయన భార్య గృహిణి. ఒక పాఠశాలలో శ్రీతరెడ్డి 9వ తరగతి, బిశ్వంత్ రెడ్డి ఐదో తరగతి చదువుతున్నారు. ఉద్యో గం లేని కారణంగా ఆరు నెలలుగా చంద్రశేఖర్‌రెడ్డి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా సోమవారం రాత్రి వీరంతా ఆత్మహత్యకు పాల్పడటం విషాదాన్ని నింపింది.

ముందుగా ఇద్దరు పిల్లలను చంపి, ఆ తర్వాత దంపతులిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా వీరి స్వస్థలం నాగర్‌కర్నల్ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామం.