calender_icon.png 30 October, 2024 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్ ముందు దంపతుల ఆత్మహత్యయత్నం

10-08-2024 10:52:42 AM

విజయక్రాంతి, లక్షెట్టిపేట్:  పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పాక చిలకమ్మా, భూమయ్య అనే దంపతులు ఆత్మహత్య యత్నం చేసిన ఘటన కలకలం రేపింది.  బాధితులు తెలిపిన  వివరాల ప్రకారం, తిమ్మాపూర్ శివారులో సర్వే నెంబర్ 461, 462 లలో తమ భూమి సమస్య పరిష్కారంలో అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో క్రిమిసంహారక మందు డబ్బాతో వచ్చి పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యయత్నం చేశారు. తమ భూమిని నెరెళ్ళ సురేష్ అనే వ్యక్తి ఆక్రమించారని బాధితులు తెలిపారు. నేరెళ్ల సురేష్ పై రౌడీ షీట్ ఉందని తమను చంపుతామని బెదిరిస్తున్నట్లు ఆ దంపతులు గోడు వెళ్ళబోసుకున్నారు.

మేము గత మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం వలననే తమ పొలాన్ని, పైపులను ధ్వంసం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యయత్నంపై ఎస్సై సతీష్ ను వివరణ కోరగా, బాధితులు గురువారం పిటిషన్ ఇచ్చారని, ఇప్పటికే కౌంటర్ కేసు నమోదు అయినందున విచారణ జరుపుతున్నామని వివరించారు. బాధితులు శాంతించకపోగ సీఐ నరేందర్ వచ్చి తాను స్వయంగా కేసును పర్యవేక్షిస్తానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.