03-03-2025 12:00:00 AM
పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణలో అగ్రగామిగా ఐఐటీ హైదరాబాద్
భారత ఉపరాష్ర్టపతి జగదీష్ దన్ఖడ్
సంగారెడ్డి, మార్చి 2 (విజయక్రాంతి): భారత్ కంపెనీలు గ్లోబల్ లీడర్లతో పోటీ పడాలని, సాంకేతిక ఆవిష్కరణల పురోగతి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కీలకం గా ఉంటుందని భారత ఉపరాష్ర్టపతి జగదీష్ దన్ఖడ్ తెలిపారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని కంది సమీపంలో ఉన్న ఐఐటి హైదరాబాద్ లో జరిగిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఐఐటి హైదరాబాద్ ఆలోచనలు ఆవిష్కరణల సాధనలో అగ్రమికంగా నిలిచిందని ప్రశంసించారు. ఐఐటి హైదరాబాద్ సాంకేతిక పురోగతికి చేసిన గొప్ప కృషిని భవిష్యత్తు నాయకులను తీర్చిదిద్దడంలో ఎంతో పాత్ర ఉంటుందని తెలిపారు.
ఐఐటీలో 300 మంది ప్రతిభవంతులు అధ్యాపకులుగా పనిచేయడం అభినందనీయమన్నారు. మౌలిక సదుపాయాలు అవసరమైన వాటిని సమకూర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆధ్యాపకులు విజయాలను సాధించేందుకు అంకితభావంతో పనిచేస్తున్నారని అభినందించారు. భవిష్యత్తు ఆవిష్కరణలు విద్యార్థుల మనసులపై చిరస్థాయిగా ప్రభావం చూపిస్తుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు సృజనాత్మకమైన నవీనమైన భారతదేశాన్ని నిర్మించడానికి కృషి చేయాలి అన్నారు.
ఐఐటి విద్యార్థులతో పలు విషయాలపై మాట్లాడి తెలుసుకున్నారు. నవీకరణ ఆర్థిక జాతీయత సాంకేతికత న్యాయకత్వంపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ర్ట గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ, ఉపరాష్ర్టపతి సతీమణి సుదేశ్ దన్ఖడ్, ఐఐటి హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి, ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ చెన్నూరు రూపేష్, మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పాల్గొన్నారు