calender_icon.png 8 January, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లా ఓటర్లు.. 6.90 లక్షలు

06-01-2025 08:03:37 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం తుది ఓటరు జాబితా వివరాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) వెల్లడించారు. జిల్లాలో మొత్తం 6,90,317 ఓటర్లు ఉండగా.. వీరిలో 3,33,070 మంది పురుషులు, 3,57,215 మంది మహిళలు, 32 మంది ఇతరులున్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. జుక్కల్లో మొత్తం 2,06402 మంది ఓటర్లు ఉండగా.. 1,01,076 మంది పురుషులు, 1,05,316 మంది మహిళలు ఉన్నారు. ఎల్లారెడ్డిలో 2,25,858 ఓటర్లు ఉండగా1,08,075 మంది పూరషులు 1,17,781మంది మహిళలు, కామారెడ్డిలో 2,58,057 ఓటర్లకు 1,23,919 మంది పురుషులు, 1,34,118 మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా 600 మంది సర్వీస్ ఎలక్టర్స్ ఉన్నారని ఎన్నికల అధికారి, కలెక్టర్ అశీష్ సాంగ్వాన్ వివరించారు.