calender_icon.png 25 October, 2024 | 3:55 AM

10 రోజుల్లో నైనీ బ్లాక్‌లో చెట్ల లెక్కింపు

09-08-2024 02:13:35 AM

  1. సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ విజ్ఞప్తి
  2. సానుకూలంగా స్పందించిన ఒడిశా సర్కార్

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): నైనీ బ్లాక్‌లో బొగ్గు వెలికితీతే లక్ష్యంగా సింగరేణి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడానికి వీలుగా చెట్ల గణన, వాటి తొలగింపు ప్రక్రియకు కూడా పూర్తి సహకారం అందించాలని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అహూజాను సింగరేణి సీఎండీ బలరామ్ కోరారు. సింగరేణి సీఎండీ విజ్ఞప్తికి అహూజా సానుకూలంగా స్పం దించారు.

10 రోజుల్లో చెట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించడానికి సహరిస్తామని అహూజా చెప్పినట్టు సింగరేణి ప్రతినిధులు గురువారం వెల్లడించారు. 643 హెక్టార్ల రిజర్వు అటవీ భూమిని సింగరేణికి బదలాయిస్తూ ఒడిశా ప్రభు త్వం  ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా మరో 140 హెక్టార్ల గ్రామ అటవీ భూమి ని కూడా అప్పగించింది. దీనిపై సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ ఆ రాష్ర్ట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవా రం సాయంత్రం భువనేశ్వర్‌లో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ  ఆధ్వర్యంలో కొత్త బ్లాక్‌ల స్థితిగతులపై ఏర్పాటు చేసిన సమావేశానికి సీఎండీ ఎన్ బలరామ్ హాజరయ్యారు.  

ఉద్యోగుల మెడికేర్ స్కీమ్‌లో సవరణ

సింగరేణిలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీమ్(సీపీఆర్‌ఎస్ ఎన్‌ఈ)లో గురువారం యాజమా న్యం సవరణలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన సింగరేణి సీపీఆర్‌ఎస్ ఎన్‌ఈ ట్రస్ట్ మీటింగ్‌లో మెడికేర్ గరిష్ఠ పరిమితిని రూ.8 లక్షలుగా నిర్ణయించారు. తాజాగా క్రిటికల్ వ్యాధులకు అపరిమిత ప్రయోజనాన్ని పొందేవిధం గా సవరణ చేశారు. గుండె సంబధిత వ్యాధులు, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, న్యూరాలజీ సమస్యలు, ఎయిడ్స్, యాక్సిడెంట్ కేసులు, తల, మెదడు, వెన్నెముక, సెరిబ్రల్ ఫీవర్‌ను క్రిటికల్ వ్యాధుల జాబితాలో ట్రస్ట్ చేర్చింది.