03-03-2025 12:56:46 AM
హైదరాబాద్, మార్చి2 (విజయక్రాంతి) : రాష్ట్రంలో రెండు టీచర్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి సోమవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కరీంనగర్, మె దక్, నిజాబామాద్, ఆదిలాబాద్ టీ చర్, పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కరీంనగర్‌లో జరగనుంది.
నల్లగొండ, వరంగల్, ఖ మ్మం నియోజకవర్గానికి సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్లగొండలో జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటిం గ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీ సులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.