25-04-2025 12:00:00 AM
ఏర్పాట్లు పూర్తి చేశాం: రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24(విజయక్రాంతి) : బుధవారం జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు శుక్రవారం జరుగనుంది. అందుకోసం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుందన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించామని, భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.
కాగా ఎన్నికల పరిశీలకులు సురేంద్రమోహన్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. బ్యాలెట్ బాక్స్‌ల వద్ద భద్రత, వీడియో రికార్డింగ్, సెక్యూరిటీ అంశాలపై పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక కౌంటింగ్ టేబుల్స్ సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా ఎన్నికల నిబంధనల మేరకు నిర్వహించుకునేం దుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, అధికారులు తదితరులు పాల్గొన్నారు..