హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఢిల్లీ, గోవా, హర్యానా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మద్యమని నమ్మించి మందుబాబులకు నకి లీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠాను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మినిస్టర్ రోడ్ నుంచి కొందరు ఆటోలో మద్యం బాటిళ్లు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న అనిల్‌కు మార్ అనే వ్యక్తిని పోలీసులు విచారించగా బంజారాహిల్స్‌లోని రోడ్‌నంబర్ 12 నుంచి మద్యం తీసుకువస్తున్న ట్లు చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సికింద్రాబాద్‌లోని ఓ రెసిడెన్సీలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ మరో 10 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన నిందితులు ప్రమోద్మల్లిక్, జగన్నాథ్ సాహూను అరెస్ట్ చేశారు. దాడిలో మొత్తం రూ.4.15 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏఈఎస్ శ్రీనివాస్ తెలిపారు.