రాష్ట్రాన్ని ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): హైదరాబాద్ పరిధిలో కల్లు విక్ర యాలకు చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు గురువారం నోటీసులు జారీచేసింది. హైదరాబాద్‌కు 5 కిలోమీటర్ల వరకు కల్లు దుకాణాల మూసివేతకు ఏం చర్యలు తీసుకుంటున్నారో కౌంట ర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
కల్లు దుకాణాల మూసివేతకు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ సరూర్‌నగర్‌కు చెందిన ఎస్ బాలరాజ్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతోకూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల వరకు తాటి చెట్లు లేవని, ఇక్కడ విక్రయించే కల్లు కల్తీ అని తెలిపారు.
అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ఇదే అంశానికి సంబంధించి మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం పెండింగ్లో ఉందని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం ఈ పిటిషన్‌ను పెండింగ్లో ఉన్న పిటిషన్కు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.