calender_icon.png 23 January, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీపీల తొలగింపుపై కౌంటర్ వేయండి: హైకోర్టు

03-07-2024 12:51:22 AM

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో జీపీలు, అడిషనల్ జీపీలు, అసిస్టెంట్ జీపీల తొలగిం పుపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. జిల్లా కోర్టుల్లో గత ప్రభుత్వ హయాంలో కొందరు జీపీలు, ఏజీపీలుగా నియామకమయ్యారు. ప్రభుత్వ మారిన నేపథ్యంలో వీరంతా రాజీనామా చేయాలని కోరుతూన్యాయ శాఖ జీవో విడుదల చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ భువనగిరికి చెందిన జీపీ నాగారం అంజయ్య సహా 21 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించేందుకే జీవో తెచ్చారని.. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ పుల్ల కార్తీక్ మంగళవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వ జీవో అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని న్యాయ శాఖ కార్యదర్శిని ఆదేశించింది.