* రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
* తదుపరి విచారణ మార్చి 6కు వాయిదా
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాం తి): రంగారెడ్డి జిల్లా గండిపేట మం డలం కోకాపేట సర్వేనంబర్ 239, 240 లో బీఆర్‌ఎస్‌కు చేసిన 11 ఎకరాల భూకేటాయిం పులను రద్దు చేయాలని కోరుతూ దాఖలై న కేసులో రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు మరోసారి ఆదేశించింది. నాలుగు వారాల్లోగా తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొంది.
ప్రభుత్వం కౌంటర్ పిటిషనర్లకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరో రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలంది. కోకాపేటలో బీఆర్‌ఎస్‌కు భూమిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ 2023లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి పిల్ వేశారు. 2024లో హైదరాబాద్‌కు చెం దిన ఏ వెంకటరామిరెడ్డి మరో పిల్ దాఖ లు చేశారు.
ఈ రెండు పిల్స్‌ను హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ జీ రాధారాణిలతో కూడిన డివిజన్ బెంచ్ మరోసారి విచారణ చేపట్టింది. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి నామమాత్ర ధరకు 11 ఎకరాలు కేటాయింపు అన్యాయమని, మార్కెట్ ధర ఎకరాకు దాదాపు రూ.50 కోట్లు ఉందని, ప్రభుత్వం కేవలం రూ. 3.41 కోట్లకే కేటాయించిందని పిటిషనర్ల వాదన.
సుమారు రూ.500 కోట్ల విలువైన భూమిని రూ.37 కోట్లకే ఇవ్వడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం చేకూరిందని పేర్కొన్నారు. కౌంటర్ దాఖలుకు 4 వారాల గడువు కావాలని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహ మ్మద్ ఇమ్రాన్ ఖాన్ కోరారు. ఇందుకు అనుమతిచ్చిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.
బీఆర్‌ఎస్‌కు భూమి.. టీన్యూస్ ఆఫీస్..
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయం కోసం ఎకరం భూమిని కేటాయిస్తూ 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 966ను కొట్టేయాలని, భూకేటాయింపుల ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిల్ లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఇందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్ పై అభ్యంతరాలుంటే రెండు వారాల్లో రిప్లయ్ కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్, మాజీ ఎమ్మెల్సీ శ్రీరాములునాయక్‌ను ఆదేశించింది. విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. 2004లో ఎకరం స్థలా న్ని అప్పటి టీఆర్‌ఎస్‌కు కేటాయిస్తూ జారీచేసిన జీవో 966ను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్సీ శ్రీరాములునాయక్ దాఖలు చేసిన పిల్‌ను గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ జీ రాధారాణిలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కు డు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ పార్టీకి కేటాయించిన స్థలాన్ని టీ న్యూస్ ఛానల్ నిర్వహణకు వినియోగిస్తున్నారని పేర్కొన్నా రు. పార్టీకి కేటాయించిన స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటున్నందున దాన్ని ప్రభు త్వం స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కావాలని అదనపు అడ్వొకేట్ జనర ల్ మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ కోరడంతో హైకో ర్టు అనుమతిచ్చి విచారణను వాయిదా వేసింది.