calender_icon.png 15 November, 2024 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌంట్ డౌన్ మొదలైంది

15-11-2024 12:51:41 AM

ఈ నెల 23న హేమంత్ సర్కార్ దుకాణం సర్దుకోవాలి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా

రాంచీ, నవంబర్ 14: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి ఓటమి తప్పదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. గురువారం జార్ఖండ్ లోని డుమ్రీలో మాట్లాడుతూ.. మొదటి విడత ఎన్నికలతో సోరెన్ ప్రభుత్వానికి కౌం ట్‌డౌన్ మొదలయిందన్నారు. ఎన్నికల ఫలితాల రోజే హేమంత్ అండ్ కంపెనీ దుకా ణం సర్దుకోవాలన్నారు. జార్ఖండ్ ఏర్పాటును ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారం కోసం అలాంటి పార్టీలతోనే హేమంత్ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. జార్ఖండ్ ప్రభు త్వం చొరబాటుదార్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అక్రమవలసదారులను రాష్ట్రం నుంచి బయటకు పంపిస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం ప్రత్యేక చట్టం తెస్తామని షా స్పష్టం చేశారు. 

జార్ఖండ్ సంపన్న అభ్యర్థి అఖిల్

జార్ఖండ్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా అఖిల్ అక్తర్ నిలిచారు. ఆయన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పాకూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసీకి దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనకు రూ.400 కోట్లకు పైగా స్థిరాస్తు లు, రూ.99 లక్షల చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. రెండోస్థానంలో ధన్‌వాడ్ నుంచి పోటీ చేస్తున్న నిరంజన్‌రాయ్ ఉన్నారు. ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.137 కోట్లు. మూడో స్థానంలో ఉన్న మహమ్మద్ దానిశ్ ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) పార్టీ నుంచి ధన్‌వాడ్ నుంచే పోటీ చేస్తున్నారు.