calender_icon.png 1 January, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబానికి పరామర్శ

28-10-2024 01:37:12 AM

గద్వాల ( వనపర్తి) ,  అక్టోబర్ 27 (విజయక్రాంతి): గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్వారంలో బాలిక మృతికి కారణమైన నిందితుడిని అదుపులోకి తీసుకుని శిక్షించాలని రాష్ట్ర పౌర హక్కుల సంఘం నాయకుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడారు. ఈ ఘటనపై పోలీసులు తమ పరిధిని మించి వ్యవహించారని ఆరోపించారు.

బంగారం దొరికిందని బాలికపై తప్పుడు ఆరోపణలు చేసి, ఆమెపై కేసు పెట్టించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు బాలికను చిత్రవధ చేశారని, భయబ్రాంతులకు గురిచేశారని వాపోయారు. ఈ కేసులో నిందితుడైన బండ్ల రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం దారుణమన్నారు.