19-04-2025 11:17:00 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓపెన్ డ్రింకింగ్ అలవాటు అయిన యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలుద్దీన్ శనివారం ఓపెన్ డ్రింకింగ్ చేసిన యువకులకు తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేశారు. బంగారు మైసమ్మ టెంపుల్ ప్రాంతంలో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న మంటరి శ్రీకాంత్, కారుపాకల శ్రీకర్, ఆత్రం శ్రీకాంత్, చింతపురి మధు కొండారి అంజన్నలను పోలీసులు పట్టుకున్నారు.
సదరు యువకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. సందర్భంగా రూరల్ సిఐ మాట్లాడుతూ... యువత మద్యం సేవించడం గంజాయి సేవించడం వంటి దూరాలవాట్లకు బానిసలు కాకుండా సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. చదువుకొని జీవితంలో ఎదగాలని చెప్పారు. ఈ మేరకు పట్టుబడిన యువకులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కౌన్సిలింగ్లో తాళ్ల గురజాల ఎస్సై రమేష్ పాల్గొన్నారు.