29-03-2025 02:00:59 AM
భీమదేవరపల్లి మార్చి 28 (విజయక్రాంతి )హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలోని రౌడీషీటర్లకు ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ కౌన్సిలింగ్ ఇచ్చారు. సిఐ కార్యాలయానికి వచ్చిన రౌడీషీటర్లతో ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు .ఎలా ఉన్నారు అని వారి నుండి సమాధానాలు రాబట్టారు. ఎలాంటి క్రిమినల్ కేసులలో తల దూర్చవద్దని విజ్ఞప్తి చేశారు. వివాదాలకు దూరంగా ఉండాలని వారిని కోరారు. నూతనంగా వచ్చిన పిడి ఆక్ట్ గురించి వారికి వివరించారు. ప్రమాదకరమైన డగ్స్ ,గంజాయి లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు .సమాజానికి హితం చేసే విధంగా ఉండాలన్నారు. అనంతరం వారి నుండి నూతనంగా దిగిన ఫోటోలను సేకరించారు .ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి ఎస్త్స్ర ప్రవీణ్ కుమార్ పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.