హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు (16వ తేదీ మినహా) చేపట్టనున్నారు. ప్రతిరోజు 213 నుంచి 215 అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు పిలిచా రు. మల్టీజోన్-1లో వివిధ పోస్టులకు సంబంధించి 659 మంది, మల్టీజోన్-2లో 627 మంది కలిపి మొత్తం 1,286 మంది అభ్యర్థులు ఉన్నారు.
మల్టీజో న్-1కి చెందిన అభ్యర్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మల్టీజోన్-2 అభ్యర్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ గన్‌ఫౌండ్రిలోని మహబూబియ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.