హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ఎప్‌సెట్ బైపీసీ అభ్యర్థులకు మంగళవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు మొత్తం 15,510 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. 460 మంది అభ్యర్థులు 9,376 ఆప్షన్లు ఇచ్చుకున్నటు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 23 వరకు, ఆప్షన్లు నమోదుకు 25 వరకు అవకాశం కల్పించారు. ఈ నెల 28న సీట్లను కేటాయించనున్నారు.