calender_icon.png 16 January, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 నుంచి అగ్రికల్చర్ కోర్సుల కౌన్సెలింగ్

08-08-2024 03:02:36 AM

రాజేంద్రనగర్, ఆగస్టు 7: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వ విద్యాల యం పరిధిలో అగ్రికల్చర్ డిప్లొమా కోర్సు ల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటివరకు మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించామని, మిగిలిన సీట్లకు ఈ నెల 12 నుంచి కౌన్సెలింగ్ జరపనున్నట్లు రిజిస్ట్రార్ వెంకటరామిరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలి పారు. విద్యార్థులు ఉదయం 10 గంటలకు వాటర్ టెక్నాలజీ సెంటర్ ఎదురుగా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్‌కు రావాలని సూచించారు. 2024 పాలిసెట్‌లో ర్యాంకులు పొం దిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఎస్‌ఎస్‌సీలో పాసైన వారికి రెండో ప్రా ధాన్యత ఇస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ పత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. విశ్వవి ద్యాలయ పాలిటెక్నిక్ కళాశాలలో ఫీజు రూ.19,460 ఉంటుందని, ప్రైవేట్ పాలిటెక్నిక్స్‌లో  రూ.22,210 ఉంటుందని చెప్పారు.