calender_icon.png 27 November, 2024 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలకు పరామర్శ

18-05-2024 01:27:56 AM

రంగారెడ్డి, మే 17 (విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండలం లోని కలకొండ గ్రామంలో కడ్తాల మండ లంలోని వాస్‌దేవ్‌పూర్ బస్‌స్టేజ్ సమీపం లో పిడుగు పాటు కు గురై మృతి చెందిన ప్రవీణ్, విద్యుత్‌ఘాతంతో నియోజకవర్గ కేంద్రంలో మృతిచెందిన రాములు కుటుంబ సభ్యులను శుక్రవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు. అధైర్య పడొద్దని తాను అండగా ఉంటానని వారికి ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నా రు. అనంతరం పిడుగు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న మాడ్గుల మండలానికి చెందిన నిరంజన్‌గౌడ్‌ను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే మరమ్మతు పనులు చేపట్టా లని అధికారులకు సూచించారు.