calender_icon.png 16 March, 2025 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సహాయం

15-03-2025 11:54:33 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలువురు బాధిత కుటుంబాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జూ పటేల్ పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతుండగా ఆయనను పరామర్శించారు. దాంతో పాటు ఇటీవల మృతి చెందిన బిక్కునూరు రమేష్, కిషోర్ల, కుటుంబాలను పరామర్శించి, రూ. 5000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.