- వాటర్ వర్క్ సిబ్బందిని బలిచేసేందుకు కుట్ర
- సిబ్బందిపై ఫిర్యాదు చేసిన మున్సిపల్ కమిషనర్
కామారెడ్డి, జనవరి 2 (విజయక్రాంతి): ప్రజలకు మేలు చేయాల్సిన కౌన్సిలర్లు కొందరు మున్సిపల్ సామాగ్రిని అమ్ముకున్నారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపా లిటీలో జరిగింది. ఈ విషయంపై ఫిర్యాదు చేసి 13 రోజులు అవుతున్న చర్యలు తీసుకోకపోవడం లేదని కొందరు కౌన్సిలర్లు మున్సి పల్ కమిషనర్ స్పందనకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిం ది.
సామాగ్రికి బాధ్యులుగా వాటర్ వర్క్స్ సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు మున్సిపల్ కమిషనర్ స్పందన పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాత సామాగ్రి అమ్ము కున్నది సిబ్బంది కాదని, కొందరు కౌన్సిలర్లు అమ్ముకొని సిబ్బందిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వాటర్‌వర్స్ సిబ్బంది చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
సామాగ్రిని అమ్మాలని ఆదేశించిన కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సిబ్బందిపై చర్యలకు దిగడమేంటని వాటర్‌వర్స్ కార్మికులు వాపో తున్నారు. ఇలా వ్యవహరిస్తే మున్సిపల్ కార్యాలయం ఎదుట కౌన్సిలర్ల పేర్లు బయటపెట్టి ఆందోళన బాట పడుతామని కార్మి కులు హెచ్చరిస్తున్నారు.
దీంతో అమ్ముకున్న సామాగ్రిలో రాగి, ఇత్తడి, కాఫర్ వైర్లను తెచ్చి ఇవ్వకుండా కేవలం ఇనుప సామాగ్రి కొంత తెచ్చి ఇవ్వడంపై మరికొందరు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.10 లక్షల విలువ చేసే సామాగ్రిని అమ్ముకొని కేవలం లక్ష విలువ చేసే సామాగ్రిని తెచ్చి ఇవ్వడంపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.