పోక్సో కేసు నమోదు
నిజామాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): మైనర్ బాలికపై కౌన్సిలర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. బోధన్ పట్టణానికి చెందిన కొత్తపల్లి రాధాకృష్ణ శక్కర్‌నగర్ కౌన్సిలర్‌గా ఉన్నాడు. పట్టణానికి చెందిన ఓ మైనర్ సోమవారం తన తల్లికి మందులు తీసుకురావడానికి ఆటోలో నిజామాబాద్ వెళ్తుండగా గమనించిన రాధాకృష్ణ ఆటోను కారుతో వెంబడించాడు. ఎడపల్లి వద్ద ఆటోను అటకాయించి, తాను నిజామాబాద్ వెళ్తున్నానని చెప్పి బాలికను కారులో ఎక్కించుకున్నాడు. కారును మంగళపహాడ్ వైపు నిర్మానుష్య ప్రాం తానికి తీసుకెళ్లి కారులో బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాలిక బంధువులకు విషయం తెలియడంతో బోధన్ పోలీ సు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా రాధాకృష్ణ సోదరుడు రవికుమార్ సైతం గతేడాది ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటం తో అతనిపైనా పోక్సో కేసు నమోదయింది. ఈ కేసులో రాధాకృష్ణ తన సోదరుడికి మద్దతు తెలపడంతో, బోధన్ మునిసిపాలిటీ లో బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న అతడ్ని పదవి నుంచి తొలిగించారు. ఈ ఘటన జరిగి ఏడాది తిరక్కుండానే రాధాకృష్ణపై పో క్సో కేసు నమోదు కావడం గమనార్హం.