పెద్దపల్లి, (విజయక్రాంతి): పెద్దపల్లి మున్సిపల్ 12వ వార్డు కౌన్సిలర్ నాంసాని సరేష్ బాబు వినూత్న రీతిలో మురుగు కాలువలో దిగి నిరసన. పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు కట్ట పక్కన నూతనంగా వేస్తున్న బీటీ రోడ్డు పక్కన డ్రైనేజీ నిర్మించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎల్లమ్మ చెరువు కట్ట రోడ్డు, డ్రైనేజీ కోసం గతంలో కోటి రూపాయలు మంజూరు చేయించారని, నిధులతో వెంటనే బీటీ రోడ్డు నిర్మించారని, కానీ డ్రైనేజీ నిర్మించకుండానే చేతులెత్తేసే ప్రయత్నం చేస్తున్నారని సరేష్ బాబు తీవ్ర ఆరోపణ చేశారు. ఈ విషయంపై అధికారులు వచ్చి హామీ ఇచ్చేంతవరకు మురుగు కాలువ నుండి బయటికి రానేరానని కౌన్సిలర్ సరేష్ బాబు స్పష్టం చేశారు