09-02-2025 01:20:33 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాం తి): బల్క్‌డ్రగ్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీడీఎంఏఐ)తో తెలం గాణ ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థుల్లో నైపుణ్య శిక్షణ పెంచడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దడం, ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్టులు, ప్లేస్‌మెంట్, పరిశోధనలు చేపట్టేలా ఫార్మా కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెస ర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు.
శనివారం మాసాబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్‌చైర్మన్ ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, బీడీఎంఏఐ ప్రతినిధులు పాల్గొన్నారు.