అకాడమిక్ క్యాలెండర్‌పై దృష్టి
హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణ ఉన్నత విద్యామండలి అకాడమిక్ క్యాలెండర్ అమలుపై దృష్టి సారించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కామన్ ఎంట్రెన్స్ టెస్టు(సెట్స్)లను సకాలంలో నిర్వహించి తరగతులను జూలైలో నిర్వహించేలా చర్యలు చేపట్టనుంది.
ప్రతి సంవత్సరం సెట్స్ అడ్మిషన్ల ప్రక్రియ, తరగతుల ప్రారంభం ఆలస్యంగా జరుగుతున్నాయి. దీనిపై దృష్టిసారిం చిన ఉన్నత విద్యామండలి వచ్చే విద్యాసంవత్సరం నుంచి సకాలంలో ప్రారంభమయ్యేలా అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టేందుకు కసరత్తు చేయబోతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉన్నత విద్యామండలికి నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన విషయం తెలతిసిందే. ఈ క్రమంలో త్వరలోనే నూతన వీసీలందరితో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ఓ సమావేశాన్ని నిర్వహించి అకాడమిక్ క్యాలెండర్ అమలుపై చర్యలు తీసుకోనున్నారు. అలాగే ఇంజినీరింగ్ బీ కేటగిరీ సీట్లను సైతం పారదర్శకంగా భర్తీ చేసేందుకు కసరత్తు చేయనున్నట్లు తెలిసింది.