calender_icon.png 7 February, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థకు భారత్ గౌరవ పురస్కార్

07-02-2025 12:00:00 AM

పురస్కారాన్ని అందుకున్న లీలా లక్ష్మారెడ్డి దంపతులు

కడ్తాల్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి ) :  కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి జిల్లా సేడం ప్రాంతం లో భారత్ వికాస్ సంగం  నిర్వహిస్తున్న భారతీయ సంస్కృతి ఉత్సవ్ -7  లో భాగంగా  సంస్థ పచ్చధనాన్ని కాపాడుకోవడం,

భవిష్యత్ తరాలకు అందమైన ప్రకృతిని అందించాలనే సంకల్పంతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రేవోల్యూషన్ విశేష కృషికి గాను గుర్తించి భారత గౌరవ పురస్కర్ ను పద్మశ్రీ  మంజమ్మ జోగాతి వారి చేతుల మీదుగా లీలా లక్ష్మారెడ్డి దంపతులు పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.

లీల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అవార్డు రావడం మరింత బాధ్యతలు పెరిగాయని హర్షం వ్యక్తం చేశారు.  కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలకు భారత వికాస్ సంగం అధ్యక్షులు శ్రీ. కె. ఎన్ గోవిందా చార్య, శ్రీ బసవరాజ్ పాటిల్ పలువురు ప్రముఖులు అభినందించారు.