calender_icon.png 30 January, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్చ లేకుండానే జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం

30-01-2025 11:28:04 AM

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం(GHMC Council Meeting) గురువారం రసాభాసగా మారింది. కాంగ్రెస్‌ హామీలు నెరవేర్చడంలేదంటూ ప్లకార్డులతో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు(BRS Corporators) నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Mayor Gadwal Vijayalakshmi) పోడియంను ముట్టడించేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు వారి తేల్లో ఉన్న ప్లకార్డులను చించేశారు. దీంతో బీఆర్ఎస్‌-కాంగ్రెస్ మధ్య తోపులాట జరిగింది. చర్చ లేకుండా జీహెచ్ఎంసీ బడ్జెట్(GHMC Budget)కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ ఆమోదం తర్వాత సభను మేయర్ విజయలక్ష్మి 10 నిమిషాలు వాయిదా వేసింది.