calender_icon.png 6 November, 2024 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తికి మద్దతు ధర పొందాలి

06-11-2024 01:40:36 AM

  1. తేమ శాతం 8 నుంచి 12 వచ్చేలా చూడాలి
  2. పత్తి కొనుగోళ్లు అధికారులు చేపట్టాలి 
  3.  మంత్రి తుమ్మల 

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాం తి):  రైతులు  పత్తిని ఆరబెట్టుకొని తేమ శా తం 8 నుంచి 12 శాతం ఉండేలా చూసుకొ ని మద్దతు ధర పొందాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి రైతులకు భారం కాకుండా పత్తి కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని మార్కెటింగ్ అధికారులను మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. 

ఇప్పటివరకు రూ. 82.44 కోట్ల విలువైన 11,255 టన్నుల పత్తిని 5,251 మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత ఏడాదిలో ఈ సమయానికి  కేవలం రూ.3.91 కోట్లతో 560.37 టన్నుల పత్తిని 233 మంది రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేశారన్నారు. బీఆర్‌ఎస్ నేతలు కోరుతున్నట్లు మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులు లూస్ కాటన్‌ను మాత్రమే తీసుకురావాల్సి ఉంటుందన్నారు.

ఒకవేళ రైతు లు గన్నీ బస్తాలలో పత్తిని తెచ్చినా కూడా సీసీఐ వారీ నిబంధనల ప్రకారం పత్తిని కొనుగోలు చేయరని, సంచులలో కొనుగోలుతో పత్తి పాడయ్యే అవకాశం ఉంటుం దన్నారు. దీంతో సీసీఐ కొనుగోళ్లలో రైతులకు సంచి ధర చెల్లింపు చేయదని, ఒక వేళ రైతులు మార్కెట్‌కు లూస్ కాటన్ తెస్తే యార్డు నుంచి జిన్నింగ్ మిల్లులకు వెళ్లే రవాణా ఖర్చుతో పాటు లోడింగ్, అన్ లోడింగ్ ఖర్చులు రైతుల మీదే పడుతుందని అన్నారు.

ఈ భారం రైతులకు ఉండకూడదనే మార్కెట్ యార్డులకు సమీపంలో ఉన్న, సీసీఐ నోటిఫై చేసిన ప్రతి ఒక్క జిన్నింగ్ మిల్లు పనిచేయాలని ఆదేశించారు. 

యాప్‌ను ఉపయోగించుకోవాలి

 రైతులకు వీలుగా ఉండేలా ప్రతి జిన్నింగ్ మిల్లులో ఎంత సమయం వేచిఉండాలో తెలుసుకునేలా యాప్‌ను రూపొందించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ యాప్‌ను పూర్తిస్థాయిలో రైతులు ఉపయోగించుకొని ఎటు వంటి ఇబ్బందులు పడకుండా సులభంగా వారి పత్తిని మద్దతు ధరకు సీసీఐ సెంటర్లలోనే విక్రయించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్లు, మార్కెటింగ్ అధికారులు విధిగా పర్యవేక్షించాలని, వాట్సాప్ యాప్ ద్వారా వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదును మార్కెటింగ్ శాఖ సంచాలకులు పరిశీలించి, తిరిగి ఫోన్ ద్వారా ఫిర్యాదులు పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటివరకు 188 ఫిర్యాదులను స్వీకరించగా, 157 ఫిర్యాదులను పరిష్కరించినట్టు వివరించారు.