కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లోని మద్నూర్ మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసిఐ కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలు రెండు రోజులపాటు బందు చేస్తున్నట్లు సిసిఐ కొనుగోలు కేంద్ర నిర్వాహకులు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య తెలిపారు. శని, ఆదివారం రెండు రోజులు పత్తి రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రానికి పత్తిని తేవద్దని ఆమె సూచించారు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రెండు రోజులు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. పత్తి రైతులు సోమవారం సిసిఐ కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకొచ్చి అమ్ముకోవాలని తెలిపారు ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లి భక్తిని అమ్ముకోవద్దని ధర తక్కువగా వచ్చి నష్టపోతారని ఆమె తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పత్తి రైతులు పొందాలని తెలిపారు.